దానిమ్మ తొక్క శరీర నిర్విషీకరణకు అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్స్, విటమిన్-సి ని కలిగి ఉంటుంది.

జలుబు, దగ్గు, చర్మం, జుట్టు రాలడం సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

జలుబు, దగ్గు సమయంలో అర చెంచా తేనేను, ఒక చెంచా దానిమ్మ తొక్క పొడిలో కలిపి తీసుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది.

దానిమ్మ తొక్కలోని యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇంఫ్లమేటరీ గుణాలు గొంతులోని ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి.

దానిమ్మ తొక్కలను కడిగి వాటిలో కాస్త అలోవేర గుజ్జు, రోజ్ వాటర్, కొంత పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ మిశ్రమం వారానికి రెండు సార్లు ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుంటే అందమైన, మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

మధుమేహం, రక్త పోటు, కొలెస్ట్రాల్, వంటి జీవన శైలి రుగ్మతలను దానిమ్మ తొక్కలు నియంత్రిస్తాయి.

చెంచా తొక్క పొడిని ఒక గ్లాసు వేడి నీళ్ళలో కలిపి రోజు తాగితే.. అందులోని యాంటి ఇంఫ్లమేటరీ గుణాలు జీవన శైలి రుగ్మతలను నివారిస్తాయి.

దానిమ్మ తొక్క పొడితో తయారు చేసిన టీని రోజూ ఉదయాన్నే తాగితే మలబద్ధకం, పేగు వాపు సమస్యలను తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Images Credit: Pexel