మేక మెదడు ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది?

చాలామంది మేక మెదడు లేదా మటన్ బ్రెయిన్‌ను చాలా ఇష్టంగా తింటారు. దాన్ని వేపుకుని తింటే భలే ఉంటుందని అంటారు.

ఇంతకీ మటన్ బ్రెయిన్ తినొచ్చా? దాని వల్ల శరీరానికి లభించే పోషకాలు ఏమిటీ?

మేక మెదడులో ఐరన్, ప్రోటీన్ తదితర పోషకాలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలం.

ఒమేగా 3 జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒమేగా 3 రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. కాబట్టి హృద్రోగులకు ఇది మంచిదే.

మేక మెదడులోని విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. నాడీ వ్యవస్థ పనీతీరు మెరుగుపరుస్తుంది.

ఇక రుచి విషయానికి వస్తే.. ఇది కాస్త మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. భలే టేస్టీగా ఉంటుంది.

మేక మెదడులో సంతృప్త కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు.

అధిక బరువు, బీపీ, డయాబెటిస్ ఉన్నవారు.. దీనికి దూరంగా ఉండటమే బెటర్.

నెలలో కేవలం రెండు సార్లు మాత్రమే తినండి. అతిగా తింటే కొత్త సమస్యలు వస్తాయి.

Images Credit: Pexels