చేపల్లో ప్రొటీన్ అధికం. అయోడిన్ తో పాటు రకరకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. చేపలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా చేపలు తినే పెద్ద వయసు వారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు యాంటీ డిప్రెసెంట్ మందుల పనితీరు మెరుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి. సాల్మన్ వంటి నూనె కలిగిన చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఒమెగా3 లేదా ఫిష్ ఆయిల్ తీసుకుంటే టైప్1 డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ను నివారించడం సాద్యమవుతుంది. తరచుగా చేపలు తినే పిల్లల్లో ఆస్తమాతో బాధపడే ప్రమాదం 24 శాతం వరకు తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపలు తరచుగా తినే స్త్రీలలో వయసు పెరగడం వల్ల మాక్యూలార్ డీజెనరేషన్ రేటు తగ్గుతుంది. Representational Image : Pexels