బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తిన్నోల్లంతా వెరీ గుడ్డు! బ్రేక్‌ఫాస్ట్ లోగుడ్డు తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. గుడ్లులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు కండరాలను బలంగా తయారు చేస్తాయి. గుడ్డు తింటే త్వరగా ఆకలి వేయదు, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుడ్డులోని డి, బి విటమిన్లు, సెలీనియం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. గుడ్డులోని కోలిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. గుడ్డులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. All Photos Credit: pixabay.com