విటమిన్ డి లోపం ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తోంది.

తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు



సూర్యరశ్మిని మించిన సహజమైన విటమిన్ డి కలిగిన విషయం మరోటి లేదు. ప్రతి రోజూ కాసేపు నీరెండలో సమయం గడిపితే చాలు

ఓట్ మీల్ ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్. దీని ద్వారా విటమిన్ డి కూడా అందుతుంది.

అన్ని పాల ఉత్పత్తుల మాదిరిగానే సోయా పాలలో కూడా విటమిన్ డి తగినంత ఉంటుంది.

గుడ్డు మంచి పౌష్టికాహారం. దీని ద్వారా ప్రొటీన్ తో పాటు విటమిన్ డి కూడా అందుతుంది.

మరో మంచి విటమిన్ డి సోర్స్ ఫార్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్. తరచుగా తీసుకుంటే విటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది.

కాడ్ లివర్ ఆయిల్ లో కూడా విటమిన్ డి ఎక్కువ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే సహజంగా లోపం రాకుండా ఉంటుంది.

సాలమన్ లాంటి నూనె కలిగిన చేపల ద్వారా కూడా విటమిన్ డి చాలా బాగా అందుతుంది.

పాల ఉత్పత్తులన్నింటిలోకి చీజ్ లో విటమిన్ డి ఎక్కువ. అయితే చీజ్ మోతాదుకు మించి తింటే దుష్ప్రభావాలు ఉంటాయి.

పుట్ట గొడుగుల్లో కూడా మంచి పౌష్టికాహారం. ఇందులో కూడా గుడ్డు లాగే విటమిన్ డి ఎక్కువ.
Representational Image : Pexels