రోజుకు 8 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. వర్కవుట్ తర్వాత తప్పకుండా వాతావరణ స్థితిని అనుసరించి ద్రవాహారం తీసుకోవాలి.

సమయానికి భోంచెయ్యాలి. లేదంటే జీవక్రియలు మారిపోతాయ్. ఇది ఇన్సులిన్ నిరోధకతకు కారణం కావచ్చు.

గాయాలను హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కడిగేతే చర్మం ఇరిటేట్ కావచ్చు. 3-5 నిమిషాల పాటు నీటితో కడగడం మంచిది.

పెరుగు చక్కెరతో తింటుంటారు. కానీ చక్కెర ప్రొబయోటిక్స్ వల్ల కలిగే ప్రయోజనాలకు అడ్డు తగులుతుంది.

ఆర్గనిక్ అనగానే ఆరోగ్యకరం అనుకోవద్దు. మాకరోని, చీజ్ వంటి ప్రాసెస్డ్ ఫూడ్ ఆర్గానిక్ అయినా అనారోగ్యకరమైనవే.

సెరోటోనిన్ జీర్ణవ్యవస్థలో కూడా కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు రాగానే మానసిక స్థితిగతులు కూడా ఒకసారి సరిచేసుకోవడం అవసరం.

క్యాలరీలను పరిమితం చెయ్యడం వల్ల జీవక్రియల రేటు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నిపుణుల సలహా పాటించడం మంచిది.

పొగతాగడం కంటే వాపింగ్ మంచిదనే అపోహలో ఉంటారు చాలా మంది. అది చాలా ప్రమాదకరం. క్యాన్సర్ కారకం కూడా.



రోజులో ఎక్కువ సమయం పాటు కూర్చుని సమయం గడుపుతున్నారంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే .

రోజులో కచ్చితంగా ప్రతి 45 నిమిషాలకు ఒక 5 నిమిషాల పాటు నడక చాలా ప్రాణాంతక స్థితుల నుంచి రక్షిస్తుంది.

Representational Image : Pexels