పానీపూరీకి ఇన్నిపేర్లు ఉన్నాయా? ఏ రాష్ట్రంలో ఏమంటారంటే... మీ ఊరిలో పానీపూరీని ఏమని పిలుస్తారు? అదేంటీ ‘పానీ పూరీ’ అనే పిలుస్తామనేగా మీ ఆన్సర్? ఔనండి, పానీపూరీకి దేశవ్యాప్తంగా చాలా పేర్లు ఉన్నాయి. ఒడిశాలో పానీపూరీని ‘గుప్ చుప్’ అని పిలుస్తారు. ఏపీ, హైదరాబాద్, జార్ఖండ్‌లో కూడా కొందరు ‘గుప్ చుప్’ అని పిలుస్తారు. పానీ పూరీ పేరును ముంబయిలో ఎక్కువగా వాడతారు. ఢిల్లీలో పానీపూరీని ‘గోల్ గప్పే’ అని పిలుస్తారు. మధ్య ప్రదేశ్‌లో ‘పానీ కె పటాషే’ అని పిలుస్తారు. కోల్‌కతాలో పానీపూరీని ‘పుచ్కా’ అని పిలుస్తారు. గుజరాత్‌లో పానీపూరిని ‘పకోడి’ అని పిలుస్తారు. రాజస్థాన్‌లో పానీపూరీని ‘పటాషీ’ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లో పానీపూరీని ‘ఫుల్కీ’ అని పిలుస్తారు. (Images Credit: Pexels)