కీరాదోస తింటున్నారా లేదా? వేసవికాలంలో అందరూ కీరాదోస తినేందుకు ఇష్టపడతారు. కానీ వాతావరణం చల్లబడితే మాత్రం తినరు. కాలంతో సంబంధం లేకుండా కీరాదోసను కచ్చితంగా తినాలి. వీటిని పచ్చిగానే తినవచ్చు. ఎంచక్కా సలాడ్ గా మార్చుకుని తినవచ్చు. కాబట్టి వండాల్సిన కష్టం లేదు. దీనిలో 96 శాతం నీరే ఉంటుంది. దీని వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. కీరాదోస తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గకుండా, పెరగకుండా సమతుల్యంగా ఉంటుంది. చేతిలో కీరాదోస ఉంటే నీటి బాటిల్ అవసరమే లేదు. శరీరానికి కావాల్సిన నీటిని ఇది అందించేస్తుంది. పేగులకు కూడా దీన్ని తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు కీరాదోసలోని పోషకాలు సహాయపడతాయి.