2000 కోట్ల సిగరెట్లు కాల్చేస్తున్నారట



సిగరెట్లు కాల్చడం అంటే సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే. ప్రాణాన్నే పణంగా పెట్టి సిగరెట్లు కాల్చడం అవసరమా?



ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం కేవలం సిగరెట్ల కోసమే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెడుతున్న డబ్బు 1,77 342 కోట్ల రూపాయలు.



ప్రపంచంలో 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీరంతా కలిసి రోజుకు 2000 కోట్ల సిగరెట్లు పీల్చి పడేస్తున్నారు.



దీనివల్ల వీరి ఆరోగ్యం పాడవ్వడమే కాదు, వారు వదిలిన పొగను పీల్చిన చుట్టుపక్కల వారి ఆరోగ్యం కూడా ఎంతో ప్రభావితం అవుతుంది.



సిగరెట్లు కాలాక వదిలే పొగలో 4800 రకాల హానికరమైన రసాయనాలు ఉంటాయి.



అందులో 70 రకాల రసాయనాలు కచ్చితంగా క్యాన్సర్లు కలగజేసేవే.



సిగరెట్లు కాల్చడం వల్ల మన శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.



సిగరెట్ కాల్చిన 20 నిమిషాల తర్వాత వరకు గుండె ఒత్తిడికి లోనవుతూనే ఉంటుంది. దీనివల్లే గుండెపోటు వచ్చే రిస్క్ పెరుగుతుంది.