ఇలా చేయడం కూడా ఓ రోగమే సన్నగా కనబడాలన్న తాపత్రయంతో డైటింగ్ చేస్తూ కావాల్సిన పోషకాలు, ఖనిజాలు శరీరానికి అందించకుండా నీరసపడిపోతుంటారు ఎంతోమంది. ఇలా ఆహారం తినకుండా సన్నబడాలన్న కోరికతో ఉండే వారికి అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిసార్డర్ ఉన్నట్టే. ఇది ఆహారానికి సంబంధించిన ఒక మానసిక సమస్య. ఇది ఉంటే ఆహారాన్ని తినేందుకు ఇష్టపడరు. ఇలా శరీరానికి సరిపడా ఆహారం తినకపోవడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశం ఉంది. అంటే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. ఇది చివరికి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టడంతో పాటు మరణానికి కారణం అవుతుంది. కాబట్టి బరువు తగ్గాలన్న కోరికతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం మంచి పద్ధతి కాదు. ఈ ఈటింగ్ డిజార్డర్ ఎందుకు వస్తుందనేది మాత్రం ఖచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది.