చాక్లెట్లు శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లని అందిస్తాయి. అందుకే రోజుకొక చిన్న ముక్క చాక్లెట్ నోట్లో వేసేసుకోండి.



డార్క్ చాక్లెట్ లో ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులని నయం చేయడంలో సహాయపడతాయి.



డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తాయి.



చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.



రక్తపోటు తగ్గిస్తుంది



డార్క్ చాక్లెట్ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్ లని తగ్గించడంలో సహాయపడతాయి.



రక్తపోటు నిరోధించడం, మంచి కొలెస్ట్రాల్ పెంచడం, ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గించడం.. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.



చాక్లెట్ లో కోకో ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఇవి ఆలోచన పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడతాయి.



ఏకాగ్రత, శ్రద్దని పెంచుతాయి. అందుకే చాక్లెట్లు తింటే మెదడు చక్కగా పని చేస్తుందని చెప్తుంటారు.