చికెన్ సూప్ తాగితే జలుబు, దగ్గు మాయం

చికెన్ కర్రీ, వేపుడు, బిర్యానీలు అధికంగా లాగిస్తారు, కానీ చికెన్ సూప్ మాత్రం చాలా తక్కువగా తాగుతారు.

పాశ్చాత్య దేశాల్లో చికెన్ సూప్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

దీన్ని గోరువెచ్చగా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జలుబు, దగ్గు వంటివి తరచూ వేధిస్తుంటే చికెన్ సూప్ తాగితే ఉపశమనం కలుగుతుంది.

రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు కూడా చికెన్ సూప్ ఎంతో దోహదం చేస్తుంది.

యాంటీబయోటిక్స్ వాడుతున్నప్పుడు చికెన్ సూప్ తాగితే ఆ మందులు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.

అంటువ్యాధుల నుంచి కాపాడే శక్తి చికెన్ సూప్ కు ఉంది.

శరీరానికి అత్యవసరమైన ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.