రీసెంట్‌గా సోనాక్షీ సిన్హాకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందనే న్యూస్ వైరల్ అయ్యింది.
సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె వెలికి ఉంగరం ఉండటం చూసి ఎంగేజ్‌మెంట్ అనుకున్నారు.
వెలికి ఉంగరంతో పాటు ఎవరి భుజం మీదో చేతులు వేసినట్టు ఉండటంతో సోనాక్షి ఎంగేజ్‌మెంట్ నిజం అనుకున్నారంతా
చివరకు, సోనాక్షి సిన్హా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అందరి చెవిలో పువ్వులు పెట్టారు.
సోనాక్షీ సిన్హాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు. ఒక నెయిల్ ఆర్ట్ కంపెనీ ప్రమోషన్ కోసం ఆమె ఇలా చేశారు.
సోనాక్షి వెలికి ఉన్న ఉంగరాన్ని చూశారు కానీ... ఆమె గోళ్లను ఎవరూ చూడలేదు. అందుకని, పప్పులో కాలేశారంతా!
ఇటీవల సదరు కంపెనీ పార్టీలో సోనాక్షి ఇలా సందడి చేశారు.
దాంతో నవ్వుకోవడం ప్రేక్షకుల వంతు అయ్యింది. (All images courtesy: Sonakshi Sinha / Instagram)