వాస్తు ప్రకారం అక్వేరియంలో ఎన్ని చేపలుండాలి

వాస్తు పట్టింపు ఉన్నవారికి ఇంట్లో ప్రతి అడుగూ సెంటిమెంటే

ఏ దిక్కున ఏం పెట్టాలి, అసలు ఇంట్లో ఏం ఉండొచ్చు, ఏ ఉండకూడదనే సందేహాలెన్నో. వీటిలో భాగమే అక్వేరియం.

అక్వేరియంలో 9 చేపలు ఉండేలా చూసుకుంటే మంచిది

వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండాలి. మిగిలిన ఒకటి కచ్చితంగా నల్లచేప ఉండాలి

డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి

నల్ల చేప... ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది

అక్వేరియంలోని ఓ చేప చనిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు..మరో చేపను తీసుకొచ్చి వేయండి

చనిపోయిన చేపని ఇంటి బయట మట్టిలో పాతేయండి, అలాంటి చేపనే తిరిగి అక్వేరియంలో చేర్చండి

ఎప్పటికప్పుడు లెక్క తొమ్మిదికి తగ్గకుండా చూసుకుంటే ఇంట్లో అంతా శుభమే

పంచభూతాలైన.. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి

అక్వేరియంని స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి

అక్వేరియం లోపలి భాగంలో చిన్నచిన్న మొక్కలు ఏర్పాటు చేయాలి
(Images credit: Pinterest)