సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా సారా ఏదో ఒక ప్రాంతానికి చెక్కేస్తుంది. సారాకు కొండ కోనలు, మంచు కురిసే ప్రాంతాలంటే చాలా ఇష్టం. ఆమె నటించిన ‘కేదర్‌నాథ్’ సినిమా నుంచి ఆమెకు ఆ ఇష్టం మరింత పెరిగింది. అందుకే, సారా అప్పుడప్పుడు ట్రెక్కింగ్ వెళ్తుంది. ప్రసాంతమైన ప్రాంతాల్లో సారా ధ్యానం చేస్తుంటుంది. తాజాగా ఆమె కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లింది. కశ్మీర్ కొండలపై ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఒకప్పుడు ఊబకాయంతో బాధపడిన సారా.. ఇలా మారడానికి ఎంతో శ్రమించింది. సారా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. శ్రీదేవి కూతురు జాన్వీతో కలిసి అప్పుడప్పుడు వ్యాయామాలు చేస్తుంటుంది. Image Credit: Sara Ali Khan/Instagram