మే 13 శుక్రవారం రాశిఫలాలు ఈ రాశివారు వివాహేతర సంబంధం వల్ల ఇబ్బంది పడతారు
మేషం ఈరోజు స్నేహితులంతో సంతోషంగా స్పెండ్ చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలోని అధికారులతో మాట్లాడేందుకు మంచి సమయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం ఈ రోజు ఖర్చు ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులకు బహుమతి ఇస్తారు లేదా ఆర్థిక సహాయం చేస్తారు. ఇతరుల నుంచి గొప్ప స్ఫూర్తి పొందుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో పరిపక్వత ఉంటుంది.
మిథునం ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు గతంలో పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఎవరి నుంచైనా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటకం మీరు పూర్వీకుల ఆస్తి విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్యూల్లో సక్సెస్ అవుతారు. కెరీర్ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు.
సింహం తొందరపాటుతో పని దెబ్బతింటుంది. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. పై అధికారుల పట్ల మీ ప్రవర్తన చెడుగా ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు కాస్త ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం చాలా బాగుంటుంది.
కన్యా గ్రహానుకూలం లేకపోతే గోసేవ చేయడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. కొత్త పథకాలు ప్రారంభించి అమలు చేయడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారులు ఆదాయం ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తులా ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. క్రెడిట్ లావాదేవీలు నష్టాలకు దారితీస్తాయి. పనికిరాని పనిలో సమయాన్ని వృధాచేయకండి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ప్రణాళికలను వీలైనంత రహస్యంగా ఉంచండి
వృశ్చికం ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కార్యరంగంలో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.రచనా పనితో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
ధనుస్సు మీ బాధ్యత నెరవేర్చడంలో అజాగ్రత్తగా ఉండకండి. బంధువు నుంచి శుభవార్త వింటారు. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. మీ ఆలోచనలు రాణిస్తాయి. వ్యాపారంలో కొత్త డీల్ ఖరారు కావొచ్చు. వ్యాపారం పెరుగుతుంది.
మకరం కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.ఒకరి మాటల వల్ల కలత చెందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వివాహేతర సంబంధాల వల్ల వివాదాలు పెరుగుతాయి.
కుంభం అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు సత్సంగాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫీసు పని, ఇంటి పనిని బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు.
మీనం కార్యాలయంలో పోటీ పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. దాన ధర్మాలలో ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు బంధువుల ప్రదేశానికి ఆహ్వానం మేరకు వెళ్లవలసి రావొచ్చు.