దీపికా రోజూ వ్యాయామంతోపాటు యోగా, ధ్యానం కూడా చేస్తుంది. తాజాగా దీపిక తన యోగా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన ఒళ్లును విల్లులా విరుస్తూ ఔరా అనిపించింది దీపిక. దీపిక నటిగానే కాకుండా నిర్మాతగానూ మారింది. 2018లోనే ఆమె కేఏ ప్రొడక్షన్ ప్రారంభించింది. యాసిడ్ దాడి బాధితురాలి కథతో ‘ఛపాక్’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు సాధించలేదు. ఈసారి నిర్మాతగా ఆమె ఏకంగా హాలీవుడ్ చిత్రాన్నే తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ సినిమాలో నటిస్తోంది. తన భర్త రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సర్కస్’ సినిమాలో క్యామియో రోల్ పోషించనుంది. ప్రభాస్ హీరోగా, నాగశ్విన్ తెరకెక్కించనున్న పాన్ ఇండియా ప్రాజెక్టులోనూ దీపిక నటిస్తోంది. Image Credit: Deepika Padukone/Instagram