ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టం



కొంతమందిలో సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల గర్భం ధరించలేకపోతున్నారు.



స్త్రీ పురుషులిద్దరూ అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగానే సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతున్నారని వివరిస్తున్నారు వైద్యులు.



ధూమపానం చేయడం వల్ల సంతానోత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది.



స్త్రీ గర్భం ధరించే వయస్సు కూడా గర్భధారణ పై ప్రభావం చూపిస్తుంది. లేటు వయసులో పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది.



ఊబకాయం బారిన పడిన స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.



ఒత్తిడి కారణంగా గర్భం ధరించడంలో ఇబ్బందులు వస్తాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి.



నిద్రలేమి వల్ల కూడా శరీరం సంపూర్ణ సామర్థ్యంతో పనిచేయలేదు. గర్భధారణ ఆలస్యం అవుతుంది.



కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి.