నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ అంశం నెట్టింట వైరల్ అవుతోంది. తాను ప్రెగ్నెంట్ అంటూ కొద్ది రోజుల క్రితం టెస్ట్ కిట్ షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అదంతా సినిమా ప్రమోషన్ లో భాగమని నిత్యా వెల్లడించింది. 'వండర్ ఉమెన్' మూవీ కోసం అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఇటీవలు సోనీ లివ్‌లో 'వండర్ ఉమెన్' విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రినేటల్ క్లాస్‌లు తీసుకోవడానికి వచ్చే ఐదుగురు గర్భిణీల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. నలుగురు గర్భిణీలు కలిసి కారులో వెళ్లడం చూశారా? అంటూ నిత్య తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. Photos & Video Credit: Nithya Menen/Instagram