ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.



10 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 361 పరుగులు చేశాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.

ఏడు ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 339 పరుగులు సాధించాడు.

ఈ జాబితాలో మూడో స్థానంలో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు.

రోహిత్ ఖాతాలో 333 పరుగులు ఉన్నాయి.

భారత మహిళా బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ లిస్ట్‌లో ధోనిని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది.

హర్మన్ ప్రీత్ ఏడు ఇన్నింగ్స్‌లో మూడు అర్థ సెంచరీలతో 318 పరుగులు చేసింది.

కెప్టెన్ కూల్ ధోని తన నాలుగో స్థానాన్ని హర్మన్ ప్రీత్‌కు కోల్పోయాడు.

మహేంద్ర సింగ్ ధోని 11 ఇన్నింగ్స్‌లో మూడు అర్థ సెంచరీలతో 305 పరుగులు సాధించాడు.