ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు 2023 ప్రారంభంలో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ కారణంగా ఐపీఎల్ సీజన్‌కు రిషబ్ పంత్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.



దీంతో 2023 ఐపీఎల్‌కు ఢిల్లీ కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది.

ఈసారి ఢిల్లీ కెప్టెన్సీ చేసే అవకాశం డేవిడ్ వార్నర్‌కు వచ్చిందని తెలుస్తోంది.

వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ గెలిచింది.

అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడని వార్తలు వస్తున్నాయి.

మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్ 1వ తేదీన ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

లక్నో సూపర్ జెయింట్స్‌కు భారత ఆటగాడు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు.