గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై చెప్పేశాడు.

హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో భాగం కానున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా ఉన్నాడు.

గుజరాత్‌ను సక్సెస్‌ఫుల్ జట్టుగా నిలపడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు.

2022లో ఆడిన మొదటి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించింది.

2023 సీజన్‌లో కూడా ఫైనల్స్ వరకు చేరుకుంది.

ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.