Image Source: Twitter X

కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Image Source: Twitter X

1986లో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన నాగ్.. 37 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించి 'టాలీవుడ్ గేమ్ ఛేంజర్' అయ్యారు.

Image Source: Twitter X

స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే విభిన్నమైన స్క్రిప్ట్‌లతో ఎన్నో ప్రయోగాలు చేసి 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' అనిపించుకున్నారు.

Image Source: Twitter X

'శివ' సినిమాతో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కింగ్.. 'మజ్ను' ‘గీతాంజలి’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు.

Image Source: Twitter X

ఓవైపు కమర్షియల్‌ హీరోగా రాణిస్తూనే, 'అన్నమ్మయ్య' 'శ్రీరామదాసు' 'శిరిడి సాయి' లాంటి ఆధ్యాత్మిక సినిమాల్లో నటించడం ఆయనకే చెల్లింది.

Image Source: Twitter X

'నిన్నే పెళ్లాడతా' తర్వాత ‘అన్నమయ్య’ మూవీ చేసి హిట్టు కొట్టడం.. ‘సూపర్’ తర్వాత ‘శ్రీరామదాసు’గా మెప్పించడం ఆయనకు మాత్రమే సాధ్యం.

Image Source: Twitter X

'సూపర్' లో లాంగ్ హెయిర్ స్టైల్ తో ట్రెండ్ సెట్ చేసిన కింగ్.. 53 ఏళ్ళ వయసులో 'ఢమరుకం' లో 6 ప్యాక్ బాడీతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Image Source: X

'మనం' సినిమాతో తండ్రీ కొడుకులతో ఒకేసారి కలిసి నటించిన ఏకైక తెలుగు హీరోగా నాగార్జున రికార్డులకెక్కారు.

Image Source: Twitter X

న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. 43 మంది దర్శకులను, 100 మందికి పైగా టెక్నిషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

Image Source: Twitter X

హీరోగా, నిర్మాతగా నాగార్జున 9 ‘నంది’ అవార్డులు అందుకున్నారు.. 3 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటుగా రెండు జాతీయ చలన చిత్ర అవార్డులు పొందారు.

Image Source: Twitter X

‘అన్నమయ్య’కు గాను బెస్ట్ యాక్టర్ గా స్పెషల్‌ మెన్షన్‌ కేటగిరీలో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకొని, ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ హీరోగా నాగ్ నిలిచారు.

Image Source: Twitter X

'సౌత్ ఇండియన్ సుప్రీమో' అని పిలవబడే ఏకైక దక్షిణాది నటుడు అక్కినేని నాగార్జున.

Thanks for Reading. UP NEXT

పాయల్ చేతి వేలు కొరికిన హంస - వీడియో వైరల్

View next story