గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్చూ నదిపై కేబిల్ బ్రిడ్జీ ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జిపై ఉన్న సందర్శకులంతా 500 మంది వరకు నదిలో పడిపోయారు. ఆదివారం రాత్రి 10 గంటలవరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం గతంలోనే ఈ బ్రిడ్జిని నిర్మించగా, పునరుద్ధరణ తర్వాత 5 రోజుల కిందట పున:ప్రారంభించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వీ, ఆరోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై గుజరాత్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.