తెల్ల వెంట్రుకలు పీకేస్తున్నారా - కట్ చేస్తున్నారా!



జుట్టు తెల్లబడటం..వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య



మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యువులు, డీఎన్ఏ కారణంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో జుట్టు నెరిసిపోయినట్లు కనిపిస్తోంది



విటమిన్ బీ12 , విటమిన్ డీ లోపం, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, థైరాయిడ్ సమస్యలు, ధూమపానం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల జుట్టు నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.



వెంట్రుకల్లో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే నల్లగా, తక్కువగా ఉంటే తెల్లగా కనిపిస్తుంది.



అయితే చాలా మంది తెల్ల వెంట్రుకలను లాగుతుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయవద్దు



తెల్ల వెంట్రుకను లాగినప్పుడు విడుదలయ్యే మెలనిన్ ఇతర వెంట్రుకలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో జుట్టు మరింత నెరిసిపోతుంది



పదే పదే తెల్ల జుట్టును తీయడం వల్ల ఆ ప్రాంతంలో గాయం, మచ్చలు ఏర్పడి జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.



ఒకవేళ నెరిసిపోయిన జుట్టు ఇబ్బందికరంగా అనిపిస్తే.. వాటిని లాగకుండా కత్తెరతో కట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు



తెల్ల వెంట్రుకలను పీకేయకుండా న్యాచురల్ హెయిర్ ఆయిల్ వినియోగించడం మంచిది
Images Credit: Pixabay