ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరుగుతోన్న తరుణంలో అంతా బ్రౌన్ రైస్ తినడమే మంచిదని ఫిక్సవుతున్నారు
మరి బ్రౌన్ రైస్- వైట్ రైస్ లో ఏది తింటే మంచిది- రెండింటి మధ్యా వ్యత్యాసం ఏంటి
బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయని బియ్యం. సాధారణంగా మనం తినే వైట్ రైస్ బియ్యాన్ని చాలా సార్లు పాలిష్ చేస్తారు. అందుకే అవి తెల్లగా ఉంటాయి.
పాలిష్ చేసిన బియ్యం త్వరగా ఉడుకుతుంది, త్వరగా జీర్ణమవుతుంది
మరలో ఆడించిన బియ్యానికి కేవలం ఒక్కసారి మాత్రమే పాలిష్ చేస్తారు..అవే బ్రౌన్ రైస్. ఇవి ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది, త్వరగా జీర్ణంకాదు
అందుకే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఈ అన్నం అరిగేందుకు చాలా సమయం పడుతుంది కనుక.. షుగర్ లెవల్స్ కూడా అమాంతం పెరగవు.