ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల్లో గ్రీన్ టీ ఒకటి. బరువు తగ్గడానికి ఎక్కువ మంది తీసుకునే వాటిలో గ్రీన్ టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

రోజుని ఉత్సాహంగా స్టార్ట్ చేయడానికి తేనె ఒక అద్భుతమైన ఎంపిక.

గోరు వెచ్చని నీటిలో చిటికెడు సున్నం, తేనె కలిపి తీసుకుంటే యాంటీ సెల్యులైట్ చికిత్సగా అద్భుతంగా పని చేస్తుంది.

చాలా మంది గ్రీన్ టీ తాగాలని అనుకుంటారు కానీ దాని చేదు రుచి వల్ల ఇష్టపడరు.

గ్రీన్ టీ ఆకులను నీటిలో 80 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా 3 నుంచి 5 నిమిషాలు వేడి చేసుకోవాలి.

అది కాస్త చల్లారిన తర్వాత ఒక స్పూన్ తేనె కలుపుకుంటే టీ రుచి చేదుగా ఉండదు.

గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల హైపర్లిపిడెమియా నుండి రక్షణగా ఉందని బలమైన ఎపిడెమియోలాజిక్ ఆధారాలు ఉన్నాయి.

రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే గుండె జబ్బుల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.

దీని మేలైన ప్రయోజనాలు పొందాలంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
Images Credit: pixabay/ Pexels