గూగుల్ తన ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీని అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా రెండు సంవత్సరాలకు పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను డిలీట్ చేస్తుంది. యూజర్ సెక్యూరిటీని పెంచడానికి ఇలా చేస్తున్నామని గూగుల్ అంటోంది. తక్కువ ఖాతాలు ఉంటే హైజాక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని గూగుల్ తెలిపింది. 2023 డిసెంబర్ నుంచి గూగుల్ ఖాతాలు డిలీట్ చేయడం ప్రారంభిస్తుంది. ఒకసారి ఖాతా డిలీట్ అయితే అందులో ఉన్న కంటెంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, గూగుల్ మీట్, క్యాలెండర్ డేటా పూర్తిగా డిలీట్ అవుతుంది. దీంతో పాటు గూగుల్ ఫొటోస్ డేటా కూడా రిమూవ్ అయిపోతుంది. మీ ఖాతా డిలీట్ కాకుండా ఉండాలంటే ఆ అకౌంట్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడే ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది.