ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్ ఎక్కువ ఉన్నవారికి విసిగించే సమస్య మనం పెట్టే స్టోరీలకు వచ్చే రిప్లైలు. స్టోరీలకు వచ్చే రిప్లైలతో నోటిఫికేషన్ బార్ నిండిపోయి విసిగిస్తూ ఉంటుంది. మీది ప్రైవేట్ అకౌంట్ అయితే కేవలం మిమ్మల్ని ఫాలో అయ్యే వారు మాత్రమే రిప్లై ఇవ్వగలరు. ఒకవేళ పబ్లిక్ అకౌంట్ అయితే ఎవరైనా స్టోరీకి రిప్లై ఇవ్వగలరు. కానీ మీ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తే మీ స్టోరీకి ఎవరు రిప్లై ఇవ్వగలరో సెట్ చేసుకోవచ్చు. స్టోరీ రిప్లైలను డిజేబుల్ చేయడం లేదా లిమిట్ చేయవచ్చు. కేవలం కొంతమంది ఫాలోయర్లు మాత్రమే రిప్లై ఇవ్వాలి అనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళ్లాలి. అందులో ‘How can Others Interact With You’ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ‘Story Replies’లో మీకు కావాల్సినట్లు ఆప్షన్ పెట్టుకోవచ్చు.