గోంగూర రొయ్యల ఇగురు సింపుల్ రెసిపీ

రొయ్యలు - అరకేజీ
గోంగూర - ఒక కట్ట
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిమిర్చి - అయిదు

ధనియాల పొడి - ఒక టీస్పూను
పసుపు - పావు స్పూను
గరం మసాలా - అర టీస్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత

రొయ్యలు శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ మీద కళయి పెట్టి అరస్పూను నూనె వేసి, గోంగూర ఆకులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

మరో కళాయిలో నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా వేయించాలి.

అన్నీ వేగాక పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత రొయ్యలు, ఉప్పు కూడా వేసి కలపాలి.

అయిదు నిమిషాలు ఉడికాక, ముందుగా చేసుకున్న గోంగూర పేస్టును వేసి కలపాలి.

ఒక గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. అరగంట పాటూ ఉడికాక, గ్రేవీలా అయ్యాక స్టవ్ కట్టేయాలి.