మధుమేహానికి మెంతులు, మెంతాకుతో చెక్ పెట్టండి

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే మెంతులను రోజు తినాలి. రెండు వారాల్లో మీకు ఉత్తమ ఫలితం కనిపిస్తుంది.

ఇన్సులిన్ ను ప్రేరేపించే గుణంగల అణువులు మెంతుల్లో అధికంగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్‌ను అదుపులో ఉంచడానికి చాలా సహకరిస్తాయి.

ఈ గింజల్లో 4హైడ్రాక్సిస్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, మన శరీర కణాలు ఆ ఇన్సులిన్‌ను గ్రహించేలా చేస్తాయి.

రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ ఇబ్బంది లేకుండా మెంతులు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి.

అలాగే మనం తినే ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను శరీరం వెంటనే గ్రహించుకోకుండా నెమ్మదింపజేసి, రక్తంలో గ్లూకోజులు పెరగకుండా చూస్తాయి.

భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన నివేదికలో మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి మెంతులకు ఉన్నట్టు ఇప్పటికే తేల్చింది.

మెంతుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్నే కరిగే పీచు పదార్థమని అంటారు. ఇది మధుమేహులకు చాలా మేలు చేస్తుంది.

మలబద్ధకం సమస్య కూడా రాకుండా అడ్డుకుంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా మెంతులు సహకరిస్తాయి.