రెండురోజులకో అవకాడో తింటే క్యాన్సర్ దూరం? అవకాడోలు కాస్త ఖరీదైనవి. రోజూ తినకపోయినా రెండు మూడు రోజులకోసారైనా ఈ పండు తింటే ఎంతో మేలు. అధిక బరువు తగ్గాలనుకుంటే అవకాడోలు తినాలి. ఈ పండు తినడం వల్ల డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. దీనిలో ఓలియిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తపోటును, గుండె పోటును రాకుండా అడ్డుకుంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఇది చక్కని ఆహారం. ఇది రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా చూస్తుంది. అవకాడోలో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఈ పండులోని గుణాలు కాపాడతాయి. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఇ, కె, బి6, బి9 అధికంగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.