శెనగ పిండి - ఒక కప్పు కాలిఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు కారం - ఒక టీస్పూను ఉప్పు - సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు నూనె - సరిపడా పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
కాలిఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి.
ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు కలిపి బాగా కలపాలి.
ఆ మిశ్రమంలో నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలి.
ఆ మిశ్రమంలో కాలిప్లవర్ ముక్కలు వేసి ఓ పదినిమిషాలు మారినేట్ చేయాలి.
స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కాక కాలిఫ్లవర్ ముక్కలు పకోడీల్లా వేయించుకోవాలి.