తలకాయ కూర మాంసం ఇలా వండితే సూపర్


తలకాయ మాంసం - అర కిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను
కొత్తి మీర - ఒక కట్ట
మిరియాల పొడి - అర స్పూను



గరం మసాలా - ఒక టీస్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను
కారం - ఒక టీస్పూను
పసుపు - పావు స్పూను
జీలకర్ర - పావు స్పూను
కొబ్బరి తురుము - ఒక స్పూను


స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

తరువాత పసుపు, కారం, తలకాయ మాంసం ముక్కలు వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.

తరువాత కూరను కళాయిలోకి మార్చుకుని మళ్లీ చిన్న మంటపై ఉడికించాలి.

కళాయిలో ఉడుకుతున్నప్పుడు మిరియాల పొడి, గరం మసాలా, కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

దించే ముందు కొత్తి మీర తురుము వేసి స్టవ్ కట్టేయాలి.

దీన్ని అన్నంతో పాటే కాదు, రోటి, రాగి సంగటి, చపాతీలతో లాగించవచ్చు.