సింపుల్ గా కాఫీ గింజలను ఉపయోగించి ఇంట్లోనే చేసుకునే కాఫీ ఫేషియల్ గురించి తెలుసుకుందాం. ఒక స్పూన్ పొడికొట్టి కాఫీ గింజల పొడి కి పాలు కలిపి కాటన్ బాల్ సహాయంతో ముఖం మీద సర్క్యూలార్ మూమెంట్ తో రుద్దాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ ప్రక్రియ ద్వారా చర్మం శుభ్రపడుతుంది. క్లెన్సింగ్ పూర్తయినట్టే. బ్రౌన్ షుగర్, కాఫీ పొడి, బాదం నూనె ఒక్క స్పూన్ చొప్పున కలుపుకోవాలి. సర్క్యూలార్ మూమెంట్ తో చేతితో ముఖం మీద రుద్దాలి. ఇది ముఖం మీది మృతకణాలను తొలగిస్తుంది. మృతకణాలు తొలగిపోవడం వల్ల ముఖ కాంతి పెరుగుతుంది. ఒక చెంచా కాఫీ పొడి, అర చెంచా చందనం, జనపనార గింజల పొడి ఒక స్పూన్ తీసుకుని రోజ్ వాటర్ కలిపి మాస్క్ రెడి చేసుకోవాలి. ఈ మాస్క్ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి. ముఖ కాంతి రెట్టింపవడాన్ని మీరే స్వయంగా గమనించవచ్చు. Representationa Image : Pexels