సౌండ్‌బార్, సౌండ్‌బేస్ మధ్య తేడా ఏంటి? మీ టీవీకి ఏది మంచిది?

Published by: Khagesh

స్మార్ట్ టీవీల వీడియో నాణ్యతతో పాటు సౌండ్ క్వాలిటీ కోరుకుంటున్నారు. అందుకే సౌండ్‌బార్‌, సౌండ్‌బేస్‌లు వేగంగా అమ్ముడవుతున్నాయి.

ఈ రెండు సౌండ్ క్వాలిటీ పెంచుతాయి, కానీ వాటి మధ్య తేడా మీకు తెలుసా?

సౌండ్‌బార్ అనేది టీవీ కింద లేదా గోడపై అమర్చే పొడవైన, సన్నని సిస్టమ్. ఒకే యూనిట్‌లో స్పీకర్ డ్రైవర్‌లు ఉండి సౌండ్‌ క్వాలిటీ పెంచుతాయి.

సౌండ్‌బార్‌లు డాల్బీ అట్మోస్, DTS:X, వైర్‌లెస్ సబ్‌వూఫర్‌ల వంటి ఫీచర్లతో వస్తున్నాయి

సౌండ్‌బేస్ అనేది మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ పైన ఉంచే వెడల్పాటి ప్లాట్‌ఫారమ్ సిస్టమ్‌. సౌండ్‌బార్ కంటే పెద్దదిగా బరువుగా ఉంటుంది.

సౌండ్‌బేస్ పరిమాణం వల్ల ఎక్కువ సౌండ్‌ను జనరేట్‌ చేస్తుంది. మరింత మెరుగైన సౌండ్ క్వాలిటీ అందించగలదు.

టీవీ ఆడియో సిగ్నల్ HDMI, ఆప్టికల్ కేబుల్ లేదా బ్లూటూత్ ద్వారా సౌండ్‌బార్‌కు వస్తాయి. దీనివల్ల సౌండ్‌ అన్ని వైపుల వ్యాపిస్తుంది.

సౌండ్‌బేస్‌లో సౌండ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేసి, గది అంతటా వినిపించేలా చేస్తుంది.

చిన్న గదులకు సౌండ్‌బార్ మంచి ఎంపిక. డాల్బీ అట్మోస్, సరౌండ్ సౌండ్ కోరుకునే వారికి, సౌండ్‌బార్ ఉత్తమమైంది.

OTT ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తుంటే, సౌండ్‌బార్ మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

టీవీ స్టాండ్‌పై ప్లేస్ ఉండి బాస్‌ను ఇష్టపడే వారికి సౌండ్‌బేస్ మంచిది. ఎక్కువ స్పీకర్లు వద్దు అనుకుంటే ఇది బెటర్ ఆప్షన్.