బాక్సాఫీస్ దగ్గర సన్నీ డియోల్ ‘గదర్ 2’ చరిత్ర సృష్టించింది.

నాలుగో వీకెండ్‌లో ఆదివారం నాటికి రూ.500 కోట్ల మార్కును దాటింది.

‘పఠాన్’ కంటే వేగంగా ‘గదర్ 2’ రూ.500 కోట్లు దాటింది.

‘పఠాన్’కు ఈ మార్కును చేరుకోవడానికి 28 రోజులు పట్టింది.

‘గదర్ 2’ 24వ రోజులకే ఈ మార్కును చేరుకుంది.

తర్వాతి వీకెండ్‌కు ‘గదర్ 2’... ‘పఠాన్’ను దాటే అవకాశం ఉంది.

కానీ ఈ గురువారమే షారుక్ ఖాన్ మళ్లీ ‘జవాన్’తో వస్తున్నాడు.

‘గదర్ 2’ నంబర్లను ‘జవాన్’ కచ్చితంగా దాటుతుందని ట్రేడ్ నిపుణుల అంచనా.

బాలీవుడ్‌లో ‘జవాన్’ రూ.600 కోట్ల మార్కెట్‌ను కూడా ఓపెన్ చేస్తుందని అనుకుంటున్నారు.

‘గదర్ 2’... ‘పఠాన్’ దగ్గర ఆగుతుందా లేక రూ.600 కోట్ల మార్కును దాటుతుందా? అన్నది చూడాలి