జపాన్ పౌరులు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మనకు తెలిసిందే. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా చిత్రాలున్నాయ్.

జపాన్‌లో ఎక్కడ చూసినా వెండింగ్ మెషిన్సే కనిపిస్తాయ్. చిరు వ్యాపారులకు ఇది భలే లాభాలిస్తున్నాయట.

టాయిలెట్ గ్యాడ్జెట్స్‌ను జపాన్‌లో హాట్ కేకుల్లా అమ్మేస్తుంటారు.

వీధుల్లో నడుస్తుంటే కొందరు టిష్యులు ఇస్తుంటారు. అది ‘యాపారం’, దీన్ని ‘టిష్యుకుబారి’ అంటారు.

జపాన్ రైల్వే స్టేషన్‌లో పాసింజర్ పుషర్స్ ఉంటారు. ప్రయాణికులను రైల్లోకి కుక్కడమే వీరి పని.

లిమిటెడ్ ఎడిషన్ కిట్ క్యాట్స్ కేవలం జపాన్‌లోనే ఉంటాయి. రకరకాల రుచుల్లో ఇవి లభిస్తాయి.

పండ్లను వివిధ షేపుల్లో పండించి.. లగ్జరీ ఫ్రుట్స్‌గా అమ్మేయడం జపాన్‌లోనే జరుగుతుంది.

ట్రాఫిక్ సిగ్నల్స్‌లో గ్రీన్‌కు బదులు బ్లూ కలర్ ఉంటుంది. 1973 నుంచి ఈ కలర్ వాడుకలో వచ్చింది.

జపాన్‌లో ఎక్కడ చూసిన క్యాప్సుల్ హోటల్స్ కనిపిస్తాయి. తక్కువ ఖర్చుతో విశ్రాంతికి ఇదో చక్కని మార్గం.

Images and Video Credit: Pexels, Unsplash