చాలా రకాల పండ్లు, కూరగాయలు పెరుగుతో కలిపి వడ్డిస్తుంటారు.

కానీ కొన్ని పెరుగుతో అసలు కలుపకూడదు. అవేమిటో తెలుసుకుందాం.

మామిడి వంటి సీజనల్ పండ్లు పెరుగుతో తినొద్దు. వేడి, చలువ ఒకేసారి చేసి చర్మ సమస్యలు రావచ్చు.

పెరుగుతో పండ్లు కలిపినపుడు పండ్లలలో ఉండే చక్కెర వల్ల టాక్సిన్లు ఉత్పత్తి కావచ్చు. అలర్జీలకు దారితీయవచ్చు.

ఉల్లి రైతా చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇది కొంత మందిలో అలర్జీలకు కారణం కావచ్చు.

ముఖ్యంగా సొరియాసిస్, ఎక్జిమా వంటి చర్మ సమస్యలున్న వారిలో మరింత అలెర్జిక్ గా మారొచ్చు.

చేపలు చాలా ఆరోగ్యవంతమైన ఆహారం. పెరుగు, చేపలు కలిపి తీసుకోవద్దు.

వేరు వేరుగా తీసుకున్నపుడు రెండూ పౌష్టికాహారం.

ఆయిలీ ఫూడ్ తో కలిపి పెరుగు తినడం మంచిది కాదు.

దీని వల్ల జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది. ఫలితంగా సోమరితనం ఆవహిస్తుంది.
Representational Image : Pexel