హార్వర్డ్ యూనివర్సిటి పరిశోధకులు ప్రొస్టేట్ క్యాన్సర్ కు స్కలనం జరిపే ఫ్రీక్వెన్సీ కి మధ్య సంబంధాన్ని వివరిస్తున్నారు.

ప్రొస్టేట్ క్యాన్సర్ కు జన్యుకారణాలు ముఖ్యమైనవి.

తర్వాత ముఖ్యమైన కారకాలు ఆహారం, జీవన శైలి.

లైంగిక కార్యకలాపాలు ఎంతవరకు దీనికి కారణమో పరిశోధిస్తున్నారు.

ఈ పరిశోధనలో సుమారు 30 వేల మందిలో లైంగిక కార్యకలాపాలు, స్వయం తృప్తి వంటి అనేకవిషయాలను సేకరించారు.

ఈ 30 వేల మంది 20-49 మధ్య వయసు పురుషులు.

ఇప్పటి వరకు ఎక్కువ సార్లు స్కలించే వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ అని భావించారు.

కానీ నిజానికి తరచుగా స్కలించే పురుషుల్లో ప్రొస్టేట్ క్యన్సర్ ప్రమాదం తక్కువ.

నెలకు 21 సార్లు లేదా అంతకు మించి స్కలించే పరుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం 30 శాతం తగ్గినట్టు తేలిసింది.

ఇతర కారకాలైన జీవన శైలీ, ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటి జెన్ పరీక్షలు కూడా వీరికి నిర్వహించారు.

ఇలాంటి అధ్యయనం కేవలం అమెరికాలో మాత్రమే కాదు ఆస్ట్రేలియాలోనూ చేశారట.

మొత్తానికి వయసులో లైంగికంగా చురుకుగా ఉండే వారిలో వయసు మళ్లిన తర్వాత ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువ అని తేలింది.

Representational Image : Pexels