లో బీపీతో బాధపడుతున్నారా? అయితే, ఈ పని చేయండి!

చాలా మందికి లో-బీపీ సమస్య ఉంటుంది.

బీపీ పడిపోతే తల తిరగడం, కళ్లు మసకబారడం, వాంతులు, వికారం ఏర్పడుతాయి.

మరికొందరికి మూర్ఛ, పల్స్‌ రేట్‌ పడిపోవడం, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కలుగుతుంది.

కొన్ని సార్లు బీపీ మరీ పడిపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

లోబీపీ రావడానికి డీ హైడ్రేష‌న్‌, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం, విట‌మిన్ బీ12 లోపం కారణం అవుతాయి.

ఆల్కహాల్‌ ఎక్కువగా తాగడం, డ్రగ్స్‌ వాడటం వల్ల కూడా లోబీపీ వచ్చే అవకాశం ఉంది.

లో బీపీ ఉన్న వాళ్లు ఫోలేట్‌ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

లిక్విడ్‌ ఫుడ్స్, విటమిన్‌ బీ 12 అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

ఉప్పు శరీరానికి తగినంత వాడటం ఎంతో ముఖ్యం.

All Photo Credit: pixabay.com