పాదాల వాపు చాలా ప్రమాదం



ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉంటే పాదాలు వాపు రావడం సహజం. కానీ కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా పాదాలలో వాపు కనిపిస్తుంది.



ఇలా పాదాలు, కాళ్లలో వాపు కనిపించడాన్ని ఎడెమా అని పిలుస్తారు. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి.



కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కాళ్లు, పాదాలలో వాపు కనిపిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉంటే ముఖం కూడా ఉబ్బుతుంది.



కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల పాదాలలో నీరు చేరి ఉబ్బినట్టు అవుతాయి. కాబట్టి పాదాల వాపుకు లివర్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణం అని భావించవచ్చు.



కాలి సిరల్లో రక్తప్రవాహం సరిగా కాకపోయినా నీరు నిలిచిపోయి పాదాలవాపు వస్తుంది.



వాపును పట్టించుకోకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. చివరికి గుండెపోటు కూడా రావచ్చు.



కాబట్టి కాలు, పాదాలలో వాపు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.