గర్భిణులు గ్రీన్ టీ తాగవచ్చా?



ప్రతిరోజూ రెండుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుందని భావిస్తారు. అయితే ఏ ఆహారాన్ని కూడా అతిగా తీసుకోకూడదు.



చాలా మందిలో ఉన్న సందేహం గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా? లేదా? అని. వీలైనంతవరకు తాగకపోతేనే మంచిది.



గ్రీన్ టీని తాగేటప్పుడు గర్భిణీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి.



ఈ టీ వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.



టీ, కాఫీలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. గ్రీన్ టీ లో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది.



కాబట్టి గర్భిణీ స్త్రీలను కెఫీన్ ఉన్న పదార్థాలు ఏవి తీసుకోకూడదని చెబుతారు వైద్యులు.



గర్భం ధరించాక మొదటి మూడు నెలలు మాత్రం గ్రీన్ టీకి దూరంగా ఉండటమే ఉత్తమం. ఏడో నెల నుంచి గ్రీన్ టీ తీసుకోవచ్చు.



రోజుకు ఒక కప్పు మాత్రమే గ్రీన్ టీ తాగడం అన్ని విధాలా మంచిది.