విమాన ప్రయాణం హాయిగానే ఉంటుంది. కానీ, అందరికీ అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే, విమానంలో ప్రయాణం కొందరికి అస్సలు పడదు. చాలా అన్‌ఈజీగా ఫీలవుతారు. ఇందుకు మీరు తినే ఆహారం కూడా కారణం కావచ్చు. కాబట్టి, ప్రయాణానికి ముందు ఇవి తినొద్దు. బాగా వేయించిన ఆహారాన్ని అస్సలు తినొద్దు. దానివల్ల గుండెల్లో మంట ఏర్పడుతుంది. కడుపు ఉబ్బుతుంది. రెడ్ మీట్ అంత ఈజీగా జీర్ణం కాదు. దీంతో ఫ్లైట్‌లో అసౌకర్యానికి గురవ్వుతారు. విమాన ప్రయాణం డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. కాబట్టి, దాన్ని మరింత తీవ్రం చేసే కాఫీ తాగొద్దు. ఆల్కహాల్ కూడా డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. విమానం ల్యాండయ్యే సరికి తీవ్రమైన హ్యాంగ్‌ఓవర్‌కు గురవ్వుతారు. బీన్స్, బ్రకోలీ, క్యాబేజ్, కూడా తినొద్దు. కార్బొనేటెడ్ డ్రింక్స్ కూడా వద్దు. దాని వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. స్పైసీ ఫుడ్, చూయింగ్ గమ్స్ కూడా తినొద్దు. యాపిల్స్ హెల్దీ అనుకుంటారు. అవి కూడా గ్యాస్‌కు కారణమవుతాయి. Images Credit: Pexels