నూనెలో వేయించిన వంటకాలు తినకూడదు. నూనెలో వేయించినపుడు ట్రాన్స్ ఫ్యాట్స్, ఎక్కువ క్యాలరీలు వినియోగమవుతాయి.

అందువల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ఫలితంగా హృదయ సంబంధ సమస్యలు రావచ్చు.

సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, తియ్యని పండ్ల రసాలు వంటివి ఏవయసు వారైనా సరే తీసుకోవద్దు.

వీటిని తరచుగా తాగితే స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. వీటిలో పోషకాలు ఉండవు.

ఇన్‌స్టెంట్‌గా దొరికే నూడుల్స్, ఇతర ప్యాక్డ్ ఫూడ్ తీసుకోవద్దు. వీటిలో సోడియం ఎక్కువ. వీటిలో నిజానికి పోషకాలు నామమాత్రమే.

రెడీ టూ ఈట్ సీరియల్స్ లో అదనంగా చేర్చిన చక్కెరలు ఉంటాయి. వీటితో డయాబెటిస్, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

కుకీలు, కేకులు, పేస్ట్రీల వంటి బేక్డ్ ఫూడ్ తినొద్దు. రిఫైండ్ షుగర్స్ ఉంటాయి. దంతాల నుంచి గుండె వరకు సమస్యలు రావచ్చు.

ఆర్టిఫిషియల్ స్వీటనెర్స్ వాడకూడదు. వీటికి బదులుగా తేనె, స్టివియా వంటి సహజమైన స్వీటనర్లను వాడుకోవడం మంచిది.

చీజ్, మయోనైస్ వంటి అధిక కొవ్వులు కలిగిన టాపింగ్స్ వాడకూడదు. బరువు పెరగడం, కార్డియోవాస్క్యూలార్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels