లివర్ మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. అనేక జీవన క్రియల్లో పాలుపంచుకుంటుంది. ముఖ్య అవయవాల్లో ఒకటి.

లివర్ ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం.

జింజిబర్ అఫిసినలే అనే మొక్క వేరును మనం అల్లంగా ఉపయోగిస్తాం. దీనిలోని సమ్మేళనాలు లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్, ఎలినిన్, ఎజోయ్నే వంటి యాంటీఆక్సిడెంట్లు లివర్‌లో ఇన్ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. తగ్గిస్తాయి కూడా.

ఫైబర్ ఎక్కువగా ఉండే షియా, అవిసె గింజలను లివర్ సమస్యలున్నవారు తప్పక ఆహారంలో భాగం చేసుకోవాలి.

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న ఆలీవ్ ఆయిల్‌లో లివర్‌కు మేలు చేసే పోషకాలు ఎక్కువ.

సెలీనియం, విటమిన్ E కలిగిన సీ ఫూడ్ తీసుకుంటే లివర్‌లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడకుండా నివారించవచ్చు. తగ్గించవచ్చు కూడా.

రోజుకు ఒకటి రెండు కప్పుల కాఫీ లేదా టీ తీసుకోవడం కూడా లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

చిక్కుళ్లు, పప్పుల్లో ఉండే పోషకాలు లివర్ ఆరోగ్యానికి ఆవశ్యకం.

లివర్ సమస్యలతో బాధపడే వారికి చాక్లెట్‌లోని సమ్మేళనాలు మేలు చేస్తాయి.

పల్లీలు, జీడపప్పులు, బాదాముల వంటి గింజల్లో ఉండే పోషకాలు లివర్ సమస్యలు ఉన్న వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels