తినే ఆహారం మీరెలా కనిపిస్తున్నారనేది నిర్ణయిస్తుంది. మీరు తీసుకునే ఆహారం వయసు తక్కువ కనిపించేలా చేస్తాయి.

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఫ్రీరాడికల్ చర్యను ఇవి అదుపుచేస్తాయి. పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతాయి.

టమాటలలో లైకోపిన్ అనే కెరొటెనాయిడ్ సన్ డ్యామెజి వల్ల చర్మానికి నష్టం జరగకుండా కాపాడుతుంది.

అవకాడోలో మోనోసాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఫ్రీరాడికల్ చర్యను నిరోధించి చర్మం మీద ఏజింగ్ లక్షణాలు కనిపించవు.

ఏజింగ్ వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని కాపేడేందుకు అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మలో చాలా ఉంటాయి.

కూరగాయల్లో యూవీ కిరణాల డ్యామెజి నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

సల్మాన్ చేపల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడతాయి. చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి.

బ్రొకోలిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మానికి మంచి ఆహారం. ఇందులో ఉండే విటమిన్ సి, కే కూడా చర్మ ఆరోగ్యానికి అవసరం.

రెడ్ వైన్ లో కూడా యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. క్రమం తప్పకుండా పరిమితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Representational Image : Pexels