మనలో చాలా మంది చాయ్ ప్రియులు ఉండి ఉంటారు. కొంత మందికి బ్లాక్ టీ ఇష్టమైతే కొందరికి పాలు కలిపిన కడక్ చాయ్.

మరి ఏది మంచిదో తెలుసుకుందాం. బ్లాక్ టీ, మిల్క్ టీ రెండింటితోనూ యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ ఉంటుంది.

బ్లాక్ టీలో అదనంగా ఫ్లవనాయిడ్లు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.

బ్లాక్ టీ తీసుకుంటే బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

మిల్క్ చాయ్ తాగితే పాలు కలపడం వల్ల అదనంగా కాల్షియం, విటమిన్ డి అందుతాయి.

పాల చాయ్ సాధారణంగా చక్కెరతోనే తీసుకుంటాం కనుక అదనపు క్యాలరీలు చేరుతాయి.

పాలచాయ్ చాలా త్వరగా అలవాటుగా మారుతుందట. దీని ప్రభావం మానసిక ఆరోగ్యం మీద ఉంటుంది.

డిప్రెషన్, ఆందోళన, మొటిమలు, మలబద్దకానికి కారణం కావచ్చు.

కడక్ చాయ్ లేదా బ్లాక్ టీ? అని అడిగితే వీలైనంత వరకు బ్లాక్ టీ తీసుకొమ్మని నిపుణులు సూచిస్తున్నారు.

Representational Image : Pexels