మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా? అయితే మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో చెక్ చేసుకోండి.

స్పైసీ గా ఉండే ఆహారం శరీరంలోని థర్మోగ్రూలేట్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

బిర్యానీల వంటి మసాలాలు కలిగిన ఆహారం తీసుకుంటే నిద్ర మీద ప్రభావం పడుతుంది.

సోడియం అధికంగా ఉండే భోజనం వల్ల బీపీ పెరుగుతుంది. శరీరంలో నీరు చేరుతుంది.

సాల్టెడ్ నట్స్ వంటి స్నాక్స్ తీసుకుంటే నిద్ర పట్టదు.

టమాట, బెండకాయ, సోయా సాస్, రెడ్ వైన్, చీజ్ వంటి ఆసిడిక్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు.

ఆసిడిక్ పదార్థాల వల్ల టెరమైన్ అనే అమైనో ఆసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది.

అసిడిక్ ఆహారం తీసుకున్నపుడు అందుకే నిద్ర పట్టదు.

Representational image:Pexels