వయసుతో సంబంధం లేకుండా బట్టతల వచ్చేసి అందరినీ ఇబ్బంది పెట్టేస్తోంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కలబంద సాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం కాదు. కలబంద తలకి పట్టించడం వల్ల చుండ్రు సమస్య, దురద తగ్గిపోతుంది. మాడు మీద ఉండే చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది. జుట్టు నల్లగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడంలో ఆరోగ్యకరమైన మాడు అవసరం. అది కలబందతో పొందవచ్చు. నేచురల్ మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి స్కాల్ఫ్ ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులోని ఎంజైమాటిక్ కంటెంట్ తల మీద మృత కణాలు రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. అలోవెరాలో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మొత్తం జుట్టు ఆరోగ్యానికి దోహదపడతాయి. హెయిర్ కేర్ రొటీన్ లో భాగంగా వారానికి రెండు సార్లు తలకి కలబంద గుజ్జు పట్టిస్తే బాగుంటుంది. Images Credit: Pixabay/ Pexels